సిర న్యూస్, దండేపల్లి
ట్రాక్టర్ బోల్తా… ఒకరి మృతి…
-దండేపల్లి లో దారుణం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… మంగళవారం దండేపల్లి మండలం ద్వారక నుంచి గూడెం వెళ్తున్న ట్రాక్టర్ పై ఇదే మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరు పరందామ చారి(35) ట్రాక్టర్ ఇంజీన్ పై కూర్చొని గూడెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో నంబాల గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే గల పొలంలో దూసుకెళ్లి, బోల్తాకొట్టింది. ఇంజీన్ పై కూర్చున్న పరందామ చారి ట్రాలీ టైర్ కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమేరకు ట్రాక్టర్ ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ కొల్లూరి సురేందర్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.