కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి
సూర్యాపేట,(సిరా న్యూస్);
సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్ రెడ్డి డబ్బు బలానికి కాంగ్రెస్ ప్రజా బలానికి మధ్య పోటీ కొనసాగుతుందని ఈ పోటీల్లో సూర్యాపేట ప్రజలది అంతిమ విజయం అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డిసూర్యాపేట పట్టణంలో వివిధ వార్డులలో కార్నర్ మీటింగ్ ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.16 వ వార్డు – 31 వ వార్డు – 32 వ వార్డురామన్ స్కూల్, శ్రీరామ్ నగర్ 27 వ వార్డు – 28 వ వార్డు – 29 వ వార్డు: తాళ్ళ గడ్డ, మంగలి ముత్తయ్య డబ్బా కొట్టు 17 వ వార్డు – 19 వ వార్డు – 34 వ వార్డు – 35 వ వార్డుఅంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, ఖమ్మం క్రాస్ రోడ్ 20 వ వార్డు 36 వ వార్డు,జమ్మి గడ్డ4 వ వార్డు – 18 వ వార్డ్ సుందరయ్య నగర్,5 వ వార్డు,దురాజ్ పల్లి6 వ వార్డు:దాసాయి గూడెం,జాటోత్ తండఇమాంపేట,3 వ వార్డు -బీబీ గూడెం – కొండల్ రాయన్ గూడెమ్ 13 వ వార్డు,గాంధీ నగర్ – బాషా నాయక్ తండ మరియు 27,28, 29 వార్డులలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పేరిట అక్రమాస్తుల సంపాదించిన జగదీశ్ రెడ్డి ఓటమి భయముతో ఎన్ని కోట్లయినా కుమ్మరించి తిరిగి గెలవాలని ప్రయత్నిస్తున్నారని సూర్యాపేట ప్రజల బలం ముందు ఆయన డబ్బు బలం గెలవదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ సూర్యాపేట జిల్లాను జగదీశ్వర్ రెడ్డి లు సర్వనాశనం చేశారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సూర్యాపేట నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ సాధించబోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు\