సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జి ల్లాలోని ఆరు ఎక్సైజ్ పోలీషన్ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్ రెడ్డి పర్యవేక్షణలో మంగళవారం దహనం చేశారు. ప్రభుత్వ అనుమతి కలిగిన ఏడబ్ల్యూఎస్ కన్సల్టింగ్ లిమిటేడ్ గోపాలపేట తల్లాడ మండలంలో దాహనం చేశారు. ఖమ్మం, 1, 2, నేల కొండపల్లి , వైరా, మధిర, సత్తుపత్తి అబ్కారీ స్టేషన్ పరిధిలో 72 కేసుల్లో పట్టుబ డిన గంజాయిని దగ్ధం చేశారు. గంజాయి దగ్ధం కార్యక్రమంలో అసిస్టేంట్ కమిషనర్ గణేష్,ఏఈఎస్ జనార్థన్ రెడ్డి , పోలీస్ స్టేషన్ల సీఐలు పాల్గన్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 40 కేసుల్లో 484 కేజీల గంజాయి, ఖమ్మం 2 స్టేషన్లో 15 కేసుల్లో 170 కేజీలు, నేెలకొండపల్లి స్టేషన్లో ఒక కేసులో 140 కేజీలు, వైరా స్టేషన్లో ఆరు కేసుల్లో 90 కేజీలు, మధిర స్టేషన్ పరిధి లో 9 కేసుల్లో 224 కేజీలు, సత్తుపల్లిలో ఒక కేసులో 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ తీసుకొని డిప్యూటి కమిషనర్ జనార్థన్రెడ్డి పర్యవేక్షణలో గంజాయిని దగ్ధం చేశారు.