తండ్రి బాటలోనే హరీశ్……

.
కాకినాడ, (సిరా న్యూస్);
ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైంది.దీంతో ఆయా పార్టీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీ యువకులకే పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. 40 శాతం టికెట్లు యువతకేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్నారు. ఇదే కోవలో మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత బాలయోగి తనయుడు గంటి హరీశ్ మాథుర్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలని కంకణం కట్టుకున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయాలా? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? అన్న సందిగ్ధంలో పడ్డారు. హరీశ్ మాథుర్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేదానికన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల్లోనే ఉండాలని హరీశ్ మాథుర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ అధిష్టానం అటు లోక్‌సభకు పంపాలా? లేక అసెంబ్లీకి పంపాలా? పొత్తులో భాగంగా టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అన్న ఉత్కంఠ నెలకొందిలోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి వారసుడిగా గంటి హరీశ్ మాథుర్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. రాజకీయాల్లోకి వచ్చీరాగానే అమలాపురం లోక్‌సభకు పోటీ చేశారు. ఒకవేళ అమలాపురం మధ్యేమార్గంగా హరీశ్‌కు ఇస్తే పి.గన్నవరం నియోజకవర్గం జనసేనకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు జనసేన పార్టీ నాయకుడు పెనుమాల దేవీ జాన్ బాబు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. మెుత్తానికి గంటి హరీశ్ మాథుర్ పొలిటికల్ భవిష్యత్‌పై ఇప్పటికీ సందిగ్ధం వీడటం లేదు. గంటి హరీశ్ కుమార్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అది క్లారిటీ వస్తే మిగిలిన టికెట్ల పంపకం అటు జనసేన ఇటు టీడీపీలకు ఈజీ అవుతుందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. మెుత్తానికి ఈ టెన్షన్‌కు మరికొన్ని రోజుల్లో అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *