సిరా న్యూస్,నెల్లూరు;
తలసేమియా జన్యుపరమైన వ్యాధి.. ఎముక మూలుగలో హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోవడంతో తలసేమియా సంభవిస్తుంది. లక్షలాది రూపాయలు వెచ్చిస్తే గాని జరగని వైద్యాన్ని రెడ్ క్రాస్ నెల్లూరు శాఖ ఉచితంగా వందలాది మంది పిల్లలకు అందించి మరో జన్మను ప్రసాదిస్తుంది. నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఈ వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించారు. తలసేమియా వ్యాధిని గుర్తించడం అనువైనటువంటి డోనర్ను గుర్తించే పరీక్షలు నిర్వహించడం బోన్ మ్యారో వైద్యం చేయించడం సుమారు 25 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ బృహత్తర కార్యంలో సహకరిస్తున్న సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.