సిరా న్యూస్,తిరుపతి;
జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో ఈ రోజు ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి కాన్ఫరెన్స్ హాల్ లో నెలవారీ నేర సమీక్షా సమావేశమాన్ని నిర్వహించారు.
ఎస్పీ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా ప్రణాలికలను సిద్దం చేసుకోవాలని, అందరం ఇప్పటి నుండే సిద్దంగా ఉండాలని ఎన్నికలు సజావుగా సాగేందుకు ముందుగానే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాలను సెక్టార్ ల ప్రకారం విభజించి ప్రత్యేక అధికారులను నియమించి, అక్కడ అనుసరించవలసిన కార్యాచరణ గురించి అధికారులకు దిశానిర్దేశం చేసారు.
పెండింగ్ లో ఉన్న గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 Crpc కేసులు, మిస్సింగ్, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు మరియు ఇతర కేసులను సమీక్షించారు.. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్థుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్, రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.
====================