తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన టిడిపి నేత మాతంగి కృష్ణ.

సిరా న్యూస్,నెల్లూరు;
గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో బుజబుజ నెల్లూరు 25వ డివిజన్  తలపగిరి కాలనీ మరియు ఆర్టీసీ కాలనీ ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది.ఈ మీచాంగ్ తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నందువలన ఆయా ప్రాంతంలో నివసించే ప్రజలను పలకరిస్తూ ఎటువంటి సహాయం కావాలన్నా నా ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవలసిందిగా కోరడమైనది.అలాగే ఆర్టీసీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడ పరిస్థితి చూసి  ఆర్టీసీ కాలనీ మరియు తలపగిరి కాలనీలో నివసిస్తున్న  వృద్ధులకు, చిన్నపిల్లలకు పాల ప్యాకెట్లు, బిస్కెట్లు, అందజేసి ఏప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి.నేను వెంటనే మీకు సహాయం చేస్తాను అని ధైర్యం చెప్పడం జరిగింది.అలాగే ఎప్పుడు వర్షం వచ్చినా ఈ ఆర్టీసీ కాలనీ తలపగిరి కాలనీ పరిస్థితి ఇలాగే ఉండడం గత 30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నామని ప్రజలు మాతంగి కృష్ణ వద్ద వాపోయారు.ఈ సందర్భంగా 25వ డివిజన్  ఇన్చార్జ్ మాతంగి కృష్ణ  మాట్లాడుతూ అందుకు మాతంగి కృష్ణ  జిల్లా కలెక్టర్ ని మరియు మున్సిపల్ కమిషనర్ నీ కలిసి నేషనల్ హైవే అనుకొని చెరువు ఉంది నీళ్లు పోవుటకు తూములు చిన్నవిగా ఉండడంతో ఈ సమస్య ప్రతిసారి ఏర్పడుతుంది,  తూములు పెద్దవిగా చేయవలసిందిగా కోరుతామని చెప్పడం జరిగింది.మరియు  నేషనల్ అథారిటీ పీడీ ఆఫీస్ వద్దకు వెళ్లాలని దీనికి పరిష్కారం చూడవలసిందిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని  చెప్పడం జరిగింది.పై కార్యక్రమంలో  బీసీ సెల్ ఉపాధ్యక్షులు మోటుపల్లి బాలకృష్ణ యాదవ్, 25వ డివిజన్ అధ్యక్షులు షేక్ కాజా మొహిద్దిన్ ,నెల్లూరు రూరల్ ఐటీడీపి ఆరు ముళ్ళ సురేంద్ర ,షేక్. మునీర్ సుబ్బు, నాగరాజు ,ప్రసాద్.  సిసింద్రీ ,రవిచంద్ర తదితర నాయకులు, కార్యకర్తలు  కలిసి సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *