తుమ్మలకు ఖమ్మం ప్రజలపై ప్రేమలేదు

ఖమ్మం,(సిరా న్యూస్);
ఖమ్మం నగరం లో 46వ డివిజన్ లో బీఆర్ఎస్ రోడ్ షో లో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గోన్నారు.
32మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు  రహదారుల శాఖ మంత్రిగా ఉండి నిధులను సత్తుపల్లి తీసుకుని వెళ్లారు. అంతకాలం మంత్రిగా ఉన్న ఖమ్మం లో ఉన్న మున్నేరు బ్రిడ్జి  కట్టడానికి ఆయనకి ఖమ్మం ప్రజలపై ప్రేమ లేదు. ఆయన స్థానికుడు కాదు, ఆయనను గెలిపిస్తే గెలిచిన తర్వాత కనిపించడని అన్నారు. ఖమ్మంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ ఆయన పాలేరు తరలించేందుకు ప్రయత్నం చేశారు. నేను అడ్డుపడి మార్కెట్ తరలకుండా చేశాను, ఆయన మళ్లీ గెలిచిన మార్కెట్ ను తరలిస్తారు. ఖమ్మంలో ఉన్న వ్యవస్థకు అన్ని నిర్వీర్యం చేసేందుకు ఆయన పూనుకున్నారు. 2014 లో ఆయన నా మీద పోటీ చేస్తే ప్రజలు నన్ను గెలిపించారు, మరోసారి ఆయనను ఓడించాలి. రాబోయే ది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే, నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. మొదటి ఈవిఎంలో మొదటి స్థానంలో ఉన్న కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఖమ్మం నగరాన్ని రెట్టింపు అభివృద్ధి చేస్తా, కొంత పని మిగిలి ఉంది దానిని పూర్తి చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వండి. ఈవిఎం మిషన్ లు మూడు ఉన్నాయి, అందులో మొదటి మిషన్లో మొదటి స్థానంపై ఓట్ వేసి గెలిపించండని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *