తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించాలి….

 

కాంగ్రెస్ పార్లమెంట్ మీడియా ఇంచార్జి శ్రీనివాస్
పెద్దపల్లి, (సిరా న్యూస్);
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని గద్దె దించి బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామని ఏఐసీసీ పెద్దపల్లి పార్లమెంట్ మీడియా ఇంచార్జి కల్వల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం నిర్మాణం పేరిట బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని, ప్రాజెక్టుకు మనుగడ లేదని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారని అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అందర్నీ అరెస్టు చేసిన బిజెపి ప్రభుత్వం కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు కాకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేసీఆర్ మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత ముఖ్యమంత్రి హామీలను తుంగలో తొక్కి దళితులకు కేసిఆర్ తీరని అన్యాయం చేశాడని మండిపడ్డారు. దళితబందు పేరుతో కొత్త నాటకానికి తెరలేపి దళితులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. దళితులను కాకుండా గిరిజనులను కూడా మోసం చేశాడని పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి అటవీ భూములను స్వాధీనం చేసుకుని వారి హక్కులను కాలరాసి గిరిజనులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన వారిపై కేసులు నమోదు చేయించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ ఎస్ కె అక్బర్ అలీ, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ మోటం రవీందర్, బొంపల్లి ఎంపీటీసీ ఎడెల్లి శంకరయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఓర్రే అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *