నాగర్ కర్నూల్,(సిరా న్యూస్);
24అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లింగాల మండల పరిధిలోని రాయవరం, పాత రాయవరం, ధారారం గ్రామాలలో నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలంటే మరోసారి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. బిఆర్ఎస్ పార్టీ తోనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలతో పాలన అందుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలలో అన్ని రకాల సకల సదుపాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారని, మీ అందరి ఆశీర్వాదంతో మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారికి ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాకం తిరుపతయ్య, కేటి తిరుపతయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సుధీర్ గౌడ్, పీ ఏ సీ ఎస్ ఛైర్మెన్ ఆనంద్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు సునీత, కవిత శ్రీనివాసులు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, గ్రామస్థులు పాల్గొన్నారు.