ఆళ్లగడ్డ,(సిరా న్యూస్);
శుక్రవారం ఉదయం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల తొమ్మిదవ వార్డు సచివాలయం, అహోబిలం రోడ్డులో జగనన్న పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు గురించి స్థానికులకు వివరించారు.
. పట్టణ వైసిపి అధ్యక్షుడు గోపవరం నరసింహారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదవ వార్డు సచివాలయం పరిధిలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ ద్వారా సుమారు 23 కోట్ల 89 లక్షలు పైచిలుకు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయ పాల డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాధం మరియమ్మ, కౌన్సిలర్స్ డాక్టర్ సుధామణి, నరసింహులు మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్, సచివాలయం కన్వీనర్ మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, అంబడి శేఖర్ రెడ్డి, చింతకుంట మనోహర్ రెడ్డి , బండి లక్ష్మీ నరసయ్య మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు పాల్గోన్నారు.