పాదయాత్ర విజయవంతానికి సన్నద్ధమవుతున్న పార్టీ నాయకులు కార్యకర్తలు
బద్వేల్లో తెలుగుదేశం విజయమే లక్ష్యంగా రితేష్ రెడ్డి పాదయాత్ర
బద్వేల్,(సిరా న్యూస్);
తెలుగుదేశం పార్టీ యువనేత
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు
రితేష్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో త్వరలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో అన్ని తానై
పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్నారు బద్వేల్ నియోజకవర్గం రిజర్వు అయిన తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది. జరగబోయే ఎన్నికల్లో ప్రజల అభిమానం ఓటర్ల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ఎంతో ధీమాగా ఉంది