సిరా న్యూస్,హైదరాబాద్;
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దుర్గాదేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు..నవరాత్రులు అమ్మవారికి ఇష్టంగా పూజలు నిర్వహిస్తారు అలాంటి అమ్మవారిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. అమ్మవారి విగ్రహం చెయ్యి విరగ గొట్టి అక్కడ పడేశారు… ద్వీపం ఆర్పేసి , మండపం చిందరవందర చేసారు. మండపం నిర్వాహకులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మొదటగా కరెంట్ కటచేసి,సీసీ కెమెరాలు విరగగొట్టిన అనంతరం విగ్రహం చేతిని విరగకొట్టి,పూజ సమాన్ అంత చుట్టూ పడవేసి,అమ్మవారి చుట్టూ ఉన్న బరికేడ్స్ కూడా తొలగించిన దుండగులు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక వద్ద హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తుల ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విగ్రహం పై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు