నందిగామ,(సిరా న్యూస్);
దేవినేని ఉమా ఆరోపణలపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు.
నువ్వు నేను చూసుకుందాం అంటే దేనికైనా రెడీ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిగామ మండలం ఐతవరంలో మా సొంత మనిషి గణేష్ మునేరులో నీటిలో మునిగిన ప్రమాదంలో చనిపోతే నేను మా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం.దీన్ని కూడా రాజకీయం కోసం వాడుకున్నాడు దేవినేని ఉమా.ఆ గోతులు ఇసుక అక్రమ రవాణా కోసం దేవినేని ఉమా హయాంలో తవ్వినవేనని ఆరోపించారు.
దివంగత నేత వైఎస్సార్ హయాంలో కోటి ఇటుకల పథకం పెట్టి నిరుపేదలకు, ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఉచితంగా ఇటుకలు ఇచ్చాను.నేను దేవాలయాలకు, చర్చిలకు, ప్రార్ధన మందిరాలకు విరాళాలు ఇస్తా. నీకు చేతనైతే నువ్వు కూడా ఇవ్వు. అసలు నీ దరిద్రపు మొహం ఏనాడైనా ఎవరికైనా విరాళాలు ఇచ్చిందా? దేవినేని ఉమా అనే వాడు మలపత్రాష్టుడు, నికృష్టపు వెదవ. విటీపీఎస్ బూడిద విషయంలో కూడా వీడు అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఎన్టీటీపీఎస్ బూడిద బయటకు వెళ్ళాలి. విద్యుత్ నిత్యావసరం. కేంద్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు బూడిదను బ్రిక్స్, సిమెంట్ కంపెనీలకు, జాతీయ రహదారుల నిర్మాణాలకు తరలిస్తున్నారు. లోకల్ ట్రాన్స్ పోర్టర్ కోయ వెంకట్రావు నా దగ్గరకు వస్తే నేను కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని విటీపీఎస్ వారిని కోరాను. దీన్ని కూడా నాకు అపాదించి దుష్ప్రచారం చేస్తున్నాడు దేవినేని ఉమా. పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో సంసారం చేస్తాడు దేవినేని ఉమా. డబ్బుల కోసం చీకటి ఒప్పందాలు బాగానే చేస్తాడు. దేవినేని ఉమా చేసేవన్ని లోపాయికారి ఒప్పందాలే. చేసేవన్నీ చేస్తాడు. పైకి మాత్రం ఆరోపణలు చేస్తుంటాడు. వీడంత దగుల్బాజీ మరొకడు లేడని అన్నారు.