పాడి రైతులు
గుంటూరు,(సిరా న్యూస్);
సంగం డైయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర చేసే మోసాన్ని ప్రశ్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకూ సంగం డెయిరీ మోసం చేసిందంటూ ఏలూరు కలెక్టర్ స్పందనలో జాయింట్ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.పాలు పోసిన రైతులకు బకాయిలు ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర తన మోసాన్ని కప్పి పుచ్చటానికే రైతులకు పార్టీ ముద్ర వేస్తున్నారని పాడి రైతులు ఆరోపించారు. సంగం డెయిరీకి 3 లక్షల లీటర్ల పాలు పోసి మోస పోయిన తాను ఏలూరు జిల్లాలో 10ఏళ్లుగా టిడిపి నాయ కునిగా ఉన్నానని, మాకు సజ్జల తో ఏంటి సంబంధం ఎంటని ప్రశ్నించారు. సజ్జల పేరు చెప్పి విష యాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలని ధూళిపాళ్ల నరేంద్ర కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ధూళిపాళ్ల నరేంద్ర రైతులకు చేస్తున్న మోసాలపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పాడి రైతుల ప్రతినిధి ముసునూరి రాము హెచ్చరించారు.