నకిలీ ఓట్లపై మంత్రుల పిర్యాదు

సిరా న్యూస్,అమరావతి;
ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాని వైసీపీ మంత్రులు జోగి రమేష్,మెరువ నాగార్జున,ఎమ్మెల్సి అప్పి రెడ్డి,ఎమ్మెల్యే మల్లాది విష్ణుబుధవారం కలిసారు. నకిలీ ఓట్లు, పలుచోట్ల ఓట్ల తొలగింపు ఏపీ – తెలంగాణలో ఓట్లు కలిగి ఉండటంపై ఫిర్యాదు చేసారు.
తరువాత మంత్రి మెరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని చెప్పారు. ఏపీ,తెలంగాణలో రెండు చోట్ల 16 లక్షలు ఓట్లు ఉన్నాయి.వాటిని ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసాము. తెలంగాణ ఎన్నికల అయిపోయిన వెంటనే అక్కడ ఓటు క్యాన్సిల్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో నమోదు చేసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసం ఒకే చోట ఒకే ఓటు ఉండాలి. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాపాడుతుంది. విలువలేని పత్రికలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషనర్ ఇచ్చాము. చనిపోయిన, విదేశాలలో ఉన్న వారికి ఇక్కడ ఓట్లు ఉన్నాయి. రాష్టంలో చావలేక ఉద్యోగస్తులని చంద్రబాబు అడ్డుపెట్టుకుంటారని అన్నారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలి.చాలా చోట్ల రెండు మూడు ఓట్లు అనేక ప్రాంతాలలో ఉన్నాయి. దాని మీద ఫిర్యాదు చేసాము. తెలంగాణలో ఓటు వేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసాము. లక్షలు ఓట్లు ఇక్కడ నమోదు చేయాలనీ టీడీపీ,జనసేన పార్టీలు చూస్తున్నాయి. లక్షలు ఓట్లు తొలగించారు,లేదా చేర్చారు అని కొన్ని మీడియా సంస్థలు అబద్దాలు రాస్తున్నారు. టీడీపీ ఓడిపోతుంది తెలిసి ముందుగానే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *