నల్గోండ, (సిరా న్యూస్);
నల్లగొండ… నిజాంపై తిరగబడ్డ పోరుగడ్డ.. సాయుధ పోరాటానికి ఊపిరులూదిన జిల్లా. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు అండగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)కు అండగా ఉంటోంది. స్వరాష్ట్రం సాధించుకుని పదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈ పోరుగడ్డ.. ఎవరికి అండగా నిలుస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాసనసభ ఎన్నికల సమరం ఉత్కంఠగా సాగుతోంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు బరిలో నిలవడంతో ఈ జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ బీఆర్‌ఎస్, కాం్రVð స్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా… భాజపా, బీఎస్పీ, సీపీఎం సైతం పలుచోట్ల పోటీనిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 12 నియోజకవర్గాల్లో తొమ్మిదింటిని గెలిచిన బీఆర్‌ఎస్ గెలిచింది. ఈసారి అదే జోరు కొనసాగించాలని శ్రమిస్తోంది. ప్రజలు తమకే పట్టంగడతారని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది.