నాపరాతి పరిశ్రమకు భారీ ఊరట……….

                                                                                        కర్నూలు, (సిరా న్యూస్);
సంక్షోభంలో ఉన్న నాపరాతి గనుల పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గనుల లీజ్ రెన్యువల్ చార్జీలను భారీ ఎత్తున తగ్గించింది. అంతేగాక వారికి రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. దీంతో నాపరాతి గనుల పైన ఆధారపడిన యజమానులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నంద్యాల జిల్లా బనగానపల్లె, డోన్ నియోజకవర్గం నాపరాతి గనులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. కడప, ప్రకాశం జిల్లాలో కూడా నాపరాతి గనులు విస్తరించి ఉన్నాయి. వీటిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి . నాపరాళ్ల ను ఒకప్పుడు విరివిరిగా ఉపయోగించేవారు. అయితే ఈ నాపరాతి పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గ్రానైట్, టైల్స్ , మార్బుల్స్ తదితర టోన్స్ వినియోగంలోకి రావడంతో మార్కెట్లో నాపరాయికి డిమాండ్ తగ్గింది.తోడు ప్రభుత్వం పన్నులు, విద్యుత్ చార్జీలు, ప్లీజ్ రెన్యూవల్ చార్జీలు, రాయల్టీ లతో భారం అధికమైంది. దీంతో నాపరాతి గనుల పరిశ్రమపై ఆధారపడిన బతుకుతున్న వేలాది కుటుంబాలు ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయి. ఎలాగైనా నాపరాతి పరిశ్రమను గట్టెక్కించాలని పలువురు నాపరాతి పరిశ్రమ యజమానులు, కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో సమావేశ భవనంలో శనివారం నాపరాయి గనుల యజమానుల తో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజ్యాంగ నాథ్ రెడ్డి, విద్యుత్, అటవీ, భూగర్భ, గనుల శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లు వీరితో పాటు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి.., జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ లతో కలిసి గనుల యజమానులతో సమావేశం అయ్యారుసంక్షోభంలో ఉన్న నాపరాతి పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటాంమని మంత్రులు హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *