-మీ గడప గడపకి సంక్షేమ పథకాలు అందిస్తా
-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు వేములవాడ,(సిరా న్యూస్);
కథలాపూర్ మండలం తండ్రియాల,గంబిర్పూర్,తక్కల్లపల్ల్లి,బొమ్మెన, దూలుర్,చింత కుంట,(రాజారాం తండా),భుషణావు పేట, ఉట్టల్లి,పెగ్గర్ల. కతలాపూర్ సిరికొండ గ్రామాలలో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెన్నమనేని వికాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మన దేశంలో ఉండే వారి కోసమే కాకుండా దేశం అవతల ఉన్న భారతీయుల కోసం కూడా ఆలోచన చేసి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు అని మరోసారి ప్రజలకి గుర్తు చేసారు.భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయని, పిల్లల బడి ఫీజుల పైన నియంత్రణ కమిటీ వేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచాం అన్నారు.ఎమ్మెల్యే గా గెలిచిన కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం అయితే స్వంత డబ్బు ఖర్చు పెట్టుకుని అయినా మంచి మౌలిక వసతులు కల్పిస్తామని వికాస్ అన్నారు