సిరా న్యూస్, నిర్మల్:
నిర్మల్ పట్టణ కేంద్రం లోని వైఎస్ఆర్ కాలనీ లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పార్టీల కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. ఈ సందరభంగా తోపులాట చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయి, ఒకరి పై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేశారు. ప్రచారం చివరి రోజు కావడంతో, ఇరు పార్టీల నాయకులు రెచ్చిపోయారు.