సిరా న్యూస్,నందవరం;
మండల పరిధిలోని నాగలదిన్నే గ్రామపంచాయతీ పరిధిలోనిగ్రామ సచివాలయం, నూతన భవనాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని మరొకవైపు నడిపిస్తూ మంచి సుపరిపాలనను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మండల వైసీపీ నాయకులు ,శివారెడ్డి గౌడ్,విరుపాక్షి రెడ్డి, శరత్ కుమార్, అభివృద్ధి అధికారి దశరథ రామయ్య,ఈ ఓఆర్ డి ఈశ్వరయ్య స్వామి, బోయ తిమ్మప్ప, సర్పంచ్ లక్ష్మి,రాజేష్ ,చాంద్ బాషా, గ్రామాల నాయకులు, కన్వీనర్లు గృహసారథులు సచివాలయ సిబ్బంది,వాలంటీర్స్,పోలీస్ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.