నేటి నుంచి లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
+ నేడు కళ్యాణోత్సవం
+ డిసెంబర్ 1న రథోత్సవం..
+ నేటి నుంచి డిసెంబర్ 5వరకు జాతర…
సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలోని అతిప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేటితో మొదలయ్యాయి. దేశంలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానికి దశాబ్దాల చరిత్ర, మహోన్నతమైన ప్రాశస్త్యం ఉంది.. వందలాది సంవత్సరాలుగా ప్రతీ ఏట కార్తీక మాసంలో స్వామి వారి కళ్యాణోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలను అరంగవైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
వైభవంగా బ్రహ్మోత్సవాలు..
ఈ అత్యంత ప్రాచీనమైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని 11, 13 వ శతాబ్దంలో జైనుల హయాంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కల్గి, గొప్ప శిల్పకళతో నిర్మించిన ఈ ఆలయానికి ముందు భాగంలో పెద్ద జలాశయం ఉంది. ప్రతీ ఏట కార్తిక శుద్ద ఏక దశి నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంరగంగ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సైతం ఈ నెల 24 నుంచి డిసెంబర్ 5వరకు బ్రహ్మోత్సవాలు, జాతర నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
నేడు కళ్యాణోత్సవం.. డిసెంర్ 1న రథోత్సవం..
ఈ నెల 24న స్వామి వారి కళ్యాణోత్సవం, డిసెంబర్ 1న రథోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. కళ్యాణోత్సవం తరువాత ఆలయావరణలో జాతర సైతం నిర్వహిస్తారు. దీనికోసం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆలయాన్ని సిద్దం చేస్తున్నారు. ప్రతీ ఏట కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా స్వామి వారి కళ్యాణోత్సవం, కార్తీక బహుళ పంచమి పర్వదినాన రథోత్సవాన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అయితే కళ్యాణోత్సవం అనంతరం 5రోజుల పాటు స్వామి వారిని శేష, గజ, గరుడ, హన్మత్, అశ్వాది వహానాలపై ఊరేగింపు నిర్వహించడం జర్గుతుంది. నవంబర్ 30న రాత్రి ఆలయ గోపురంపై అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. మరుసటి రోజు సాయంత్రం(డిసెంబర్ 1న) స్వామి వారిని ప్రత్యేక రథంపై ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీదుల గుండా కన్నుల పండువగా ఊరేగింపు నిర్వహించనున్నారు. గ్రామంలోని ప్రధాన వీదుల గుండ సాగే ఈ రథోత్సవాన్ని వీక్షించడానికి జిల్లా నలుమూల నుంచే కాక మహారాష్ట్ర నుంచి కూడ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే ప్రతీ ఏట భక్తుల తాకిడి పెర్గుతుండటంతో భక్తుల సౌఖర్యం కోసం అవరమైన వసతులను కల్పించడానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు ముమ్మరం చేసారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కల్గుతుందని, మనోవాంచలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కావున సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే వచ్చే ఈ అవకాశాన్ని భక్తులంత సద్వినియోగం చేసుకోని స్వామి వారిని దర్శించుకొని ఆయన కృపకు పాతృలు కావాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.