నేడు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ వర్ధంతి

సిరా న్యూస్;
హాకీ వీరుడుగా, హాకీ మాంత్రికుడుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేజర్ ధ్యాన్ చంద్ 29 ఆగస్టు 1905న ప్రయాగలో జన్మించారు. ఆయన జయంతి రోజుని జాతీయ క్రీడా దినంగా మనం జరుపుకుంటాం.1926 నుంచి 1948 వరకు 22 సంవత్సరాలలో ఆయ‌న‌ కెరీర్‌లో 400 అంతర్జాతీయ గోల్స్ క‌లిపి మొత్తం 1,000 గోల్స్ సాధించాడు. ధ్యాన్ చంద్ నాయకత్వంలో, భారత హాకీ జట్టు అనేక విజయాలు సాధించింది.ఆయ‌న‌ 1928, 1932, 1936లో భారతదేశానికి 3 ఒలింపిక్ బంగారు పతకాలు సాధించంలో ముఖ్య పాత్ర పోషించాడు. మూడు సార్లు వ‌రుస‌గా ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకొని త‌న పేరు చరిత్ర పుటలలో ఎక్కించుకున్నారు.క్రీడారంగంలో భారతదేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతినార్జించి పెట్టిన ధ్యాన్ చంద్ తన చివరి రోజులలోఎటువంటి గుర్తింపు లేకుండా కడు దుర్భరజీవితాన్ని గడిపేడు. పొట్ట నింపుకోవడానికి కూడా సరిపడ డబ్బుల్లేని పేదరికంలో జీవించేడు. అటువంటిసమయంలో తమ దేశాలలోని హాకీ జట్టులకు శిక్షణనివ్వమంటూ అమెరికా, జర్మనీలు ధ్యాన్ చంద్ ని ఆహ్వానించేయి. పరాయి దేశాలకు శిక్షణనివ్వడం ద్వారా భవిష్యత్తులో భారత క్రీడాకారులకు విజయాలను దూరం చెయ్యలేనని చెప్తూ ధ్యాన్ చంద్ ఆ ఆహ్వానాలను త్రోసిపుచ్చేడు. ఇటువంటి గొప్పదేశభక్తుడిని స్వతంత్ర భారత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం విచారకరం. చివరి రోజులలో ఇండియన్ ఆర్మీ అతనిని ఆదుకుంది. ఒకసారి అహ్మదాబాదులో జరిగిన హాకీ మ్యాచ్ చూడటానికి ధ్యాన్ చంద్ వెళ్తే అతనిని గుర్తించకపోవడం వల్ల స్టేడియం లోనికి వెళ్ళనివ్వలేదు. అదే స్టేడియంలో ఆమ్యాచ్ ని జవహర్లాల్ నెహ్రూ తిలకిస్తూన్నాడు. మన దేశంలో ఏమాత్రం గుర్తింపుకు నోచుకోని ధ్యాన్చాంద్ ని స్వాతంత్ర్యానికి పూర్వమే ఏభైకి పైగా దేశాలు 400కి పైగా అవార్డులతో సత్కరించేయి. 1979 డిసెంబర్ 3 న ధ్యాన్ చాంద్ స్వర్గాస్తులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *