సిరా న్యూస్,హైదరాబాద్;
ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడం కోసం, మరియు మంచి రోజు కావడంతో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కూడా బాగానే ఉండడంతో తమ సొంతూర్లకు వెళ్ళడానికి నగర ప్రజలు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తమ కుటుంబ సభ్యులతో కలసి పల్లె బాట పట్టడంతో ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టాండ్ కిటకిట లాడుతుంది. కాగా పోయే వాళ్లంతా ఓటు హక్కును విియోగించుకునేందుకు వెళితే మంచిదే. కానీ ఇక్కడ ఓటు హక్కును కలిగి ఉండి రెండు రోజులు సెలవు వచ్చిందని ఓటు హక్కును వినియోించు కోకుండ విహార యాత్రలకు వెళితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఇంకా తెలియక పోవడం శోచనీయం.