హైదరాబాద్,(సిరా న్యూస్);
పాతబస్తీ బడా వ్యాపారుల టార్గెట్ గా ఐటీ సోదాలు శనివారం ప్రారంభమయ్యాయి. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇంటిలో, కోహినూర్ గ్రూప్స్ ఎండి మజీద్ ఖాన్ ఇళ్లలో సోదాలు జరిగాయి. షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో ఐటి శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటీ శాఖ అనుమానం. కోహినూర్ ,కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షనల్లు హోటల్స్ లో వ్యాపారవేత్తలు నిర్వహిస్తున్నారు…