సిరా న్యూస్, అదిలాబాద్:
అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పద్మశాలి సంఘం మీడియా కన్వీనర్ బండి నర్సింగ్ బిజెపిలో చేరారు. బిజెపి జిల్లా అధ్యక్షులు, అదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ నివాసంలో బిజెపి పార్టీ కండువా కప్పుకున్నారు… ఈ సందర్భంగా బండి నర్సింగ్ మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిజెపి అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి, పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట బేల మండల అధ్యక్షులు నందకుమార్ ఉన్నారు.