పాయల్ శంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి…

సిరా న్యూస్, అదిలాబాద్:

ఆదిలాబాద్ బిజెపి అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థి పాయల్ శంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోరారు. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… హిందూ అంతా సంఘటితం కావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పాయల్ శంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టిఆర్ఎస్ నాయకులు 80 శాతం ఉన్న హిందూ ఓట్లను పట్టించుకోవడంలేదని విమర్శించారు. కేవలం 12 శాతం ఉన్న ముస్లిం ఓట్లపై ఉన్న శ్రద్ధ హిందూ ఓట్లపై లేదన్నారు. ఈ ఎన్నికల్లో హిందువులంతా ఏకమై టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *