సిరా న్యూస్, భీంపూర్:
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి…
-కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్
కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి కే గ్రామం లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తో సమావేశమయ్యారు. ఈ సంద్భంగా ఆయన్ను స్థానిక నాయకులు శాలువా, పూలమాలలతో సన్మానించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్యకర్తలంత సంఘటితంగా, పార్టీ గెులుపు కోసం సైనికుల్లా కృషీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అద్యక్షుడు ముక్కెర ప్రభాకర్, ఉపాధ్యక్షుడు గేడం తానుభ, నాయకులు ఆత్రం గోవర్ధన్, గొంటిముక్కుల విలాస్, రెడ్డివార్ మహేష్, నైతం రవి, ఆత్రం జీవన్ తదితురు పాల్గొన్నారు.