పాలేరులో శ్రీ మంతుల పోటీ

సిరా న్యూస్,ఖమ్మం;
తెలంగాణ ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే బిగ్ ఫైట్ అనేక చోట్ల జరుగుతున్నా ప్రతిష్టాత్మకమైన పోరు పాలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇక్కడ మిలియనీర్లు పోటీ పడుతుండటమే. కరెన్సీ కట్టలు కట్టలుగా బయట పడుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు శ్రీమంతులే. ఈ ఎన్నికల్లో గెలుపును వారు సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరూ పార్టీలు మారిన వాళ్లే. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే. కానీ పోటీ మాత్రం సూపర్. అక్కడ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరి ఓటు చీలుస్తారన్న టెన్షన్ ఇప్పుడు ఇరు పార్టీల నేతలకు పట్టుకుంది. రాష్ట్రమంతటా పాలేరు వైపు చూస్తుంది.పాలేరులో పోటీ మామూలుగా లేదు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత బీఆర్ఎస్ లోకి మారారు. ఆయన తాను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. డబ్బులు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈసారి గెలిస్తే తనకు కేసీఆర్ కేబినెట్ లో స్థానం అని ప్రచారం కూడా ఆయన చేసుకుంటున్నారంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుంది. రెండోసారి తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. అదీ 2016 ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు.పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అడ్డాగా అని చెప్పాలి. రెడ్డి సామాజికవర్గంతో పాటు షెడ్యూలు కులాలు, తెగలు ఇక్కడ అధికంగా ఉండటంతో కాంగ్రెస్ వైపు జనం అత్యధిక సార్లు మొగ్గు చూపుతూ వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *