మేడ్చల్,(సిరా న్యూస్);
మేడ్చెల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రలోభాల పర్వం మొదలయింది. 9వ డివిజన్ లో డబ్బులు పంచుతూ మల్లారెడ్డి కళాశాల సిబ్బంది దొరికిపోయారు. స్థానికులు డబ్బు ఎక్కడివి అని ప్రశ్నించారు. తరువాత రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుకున్నారు. చెంగిచెర్ల చౌరస్తాలో మరోచోట కార్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్ లో డబ్బులున్నాయని, అవి ఓటర్లకు పంచడం కోసమే తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కార్ లో ఉన్న వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
పట్టుకున్న డబ్బులు మంత్రి మల్లారెడ్డి కి చెందిన డబ్బులు గా సమాచారం..