పెదవేగి పోలీసు స్టేషన్ కు పైకప్పు ముప్పు

సిరా న్యూస్,ఏలూరు;
వర్షం పడితే చాలు పెదవేగి పోలీస్ స్టేషన్ ముద్ద ముద్ద గా తడిసి పోయి రికార్డ్ లు ఫర్నిచర్ అంతా తడిసి పోతుందని సిబ్బంది వాపోతున్నారు. వాతావరణం మబ్బులు కమ్మితే చాలు స్టేషన్ లో పోలీస్ రికార్డ్ ఎక్కడ తడిసిపోతుందోననే ఆందోళన పోలీసుల్లో కలుగుతుంది. తూట్లు పడ్డ స్టేషన్ పై కప్పు ద్వారా వర్షపు నీరు కారకుండా టార్బా లిన్ కవర్ కప్పి అది గాలివానలకు చేదిరిపోకుండా ఆ కవర్ పై బండరాళ్లు బరువుగా పెట్టి స్టేషన్ రికార్డ్ తడవకుండా కాపాడుకోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .ఈ స్టేషన్ సుమారు 15 ఏళ్లుగా రేకుల పాకలో కొనసాగుతున్న జిల్లా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని పెదవేగి మండల ప్రజలు విమర్శించుకుంటున్నారు.ఈ రేకుల పాక పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కి రెస్ట్ రూమ్ లేదు.నిందితులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లేదు.వాహనాల కు పార్కింగ్ ప్లేస్ లేదు.స్టేషన్ చుట్టూ ప్రహరీ లేదు.ఇదీ ఒకప్పుడు వేంగి రాజుల రాజధానిగా ప్రాచీన చరిత్ర కలిగిన పెదవేగి పోలీస్ స్టేషన్ దుస్థితి.నిజమో కాదో తెలియదు కాని రికార్డ్స్ లో ఇది పక్కా భవనంగా ఉందని కానీ ఇది రేకుల పాకలో కొనసాగుతుందని ఇక్కడ పనిచేసే కొంత మంది సిబ్బంది చెప్పుకోవడం విశేషం. ఇప్పటికైనా జిల్లా పోలీసు అధికారులు ఒక సారి పెదవేగి పోలీస్ స్టేషన్ కు పక్కా భవనం లేక సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై అధ్యయనం చేయాలని పెదవేగి మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *