పెళ్లి బస్సు బోల్తా..మహిళ మృతి

నల్గోండ,(సిరా న్యూస్);
నల్లగొండ జిల్లా చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పిన పెళ్లి బృందం బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 20 మందికి తీవ్రగాయాలయ్యాయి.ఇందులో కొందరి పరిస్థితి  పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల  హాహాకారాలు మిన్నంటిపోయాయి.  క్షతగాత్రులను మూడు అంబులెన్స్ ల ద్వారా దేవరకొండ, హైద్రాబాద్ లోని ఆస్పత్రులకు తరలించారు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి హైద్రాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *