శేరిలింగంపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేకల వెంకటసుబ్బమ్మ
(సిరా న్యూస్);
పేదల అభ్యున్నతికి కృషి చేస్తానని, నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని శేరిలింగంపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేకల వెంకటసుబ్బమ్మ(మేకల విజయలక్ష్మి) తెలిపారు ఎన్నకల ప్రచారం లో బాగంగా శేరిలింగంపల్లి లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.. ఈ సందర్బంగా వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ నేను క్రింది స్థాయి నుండి వచ్చానని పేదల సాధక బాధకాలు తెలిసిన దానిగా ప్రజా సేవలో ఉన్న తనను ప్రజలు ఆదరించాడ పట్ల ఆమె అభినందనలు తెలిపారు.నియోజకవర్గ ప్రజలు తనని గుర్తించి ఆశీర్వదించాలని, తన ఆపిల్ గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. నా కున్న రాజకీయ అనుభవంతో ఎంతోమంది పేదవాళ్లకు ఎన్నో విధాలుగా పనిచేస్తూ వచ్చాను ప్రతి ఒక్క విలేజ్ నుంచి జిల్లాస్థాయి వరకు అలానే రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల్లో తిరిగి ఆర్గనైజేషన్ పనిచేయటం జరిగిందని తెలిపారు. అలానే 2016 నుండి లోక్ జనశక్త పార్టీ వారు నన్ను పార్టీలో తీసుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తూ వచ్చాను పార్టీ వారు బిజెపితో అలియన్స్ ఉండటం వల్ల ఎన్నికల్లో మాకు నా పోటీ చేయడానికి అవకాశాలు లేకుండా పోయినందువల్ల ఈరోజు నేను బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగిందని తిలిపారు. ..ఓటుకు నోటు లేదు ఈరోజు నా నినాదంతో నేను ముందుకెళ్ళాను ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీలన్నీ ఓటును డబ్బుతో కొనాలని చూస్తున్నారు అలానే ప్రజలు కూడా ఆ డబ్బులకు బానిస అయిపోయి ఓటు నమ్ముకుంటున్నారు …అది చాలా దారుణమైన పరిస్థితి దయచేసి పేదవాళ్లందరూ వైపు నేను పని చేయడానికి ముందుకు వచ్చి ఉన్నాను . మహిళలపై ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్నారు.