పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం అందించిన ఎన్ఆర్ఐ గొల్లవత్తుల రాజేశ్వర్..

సిరా న్యూస్, ఖానాపూర్:

పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం అందించిన ఎన్ఆర్ఐ గొల్లవత్తుల రాజేశ్వర్..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ లో ఓ నిరుపేద కుటుంబం కూతురి పెండ్లి చేసేందుకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ ఆర్థికంగా ఆదుకొని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. నిమ్మల లక్ష్మి ని తన భర్త వదిలేయటంతో గ్రామంలోనే కిరాయి ఇంట్లో నివాసం ఉంటుంది. తన కూతురు రిషిక వివాహం చేసేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది. సంబంధం కుదిరినప్పటికి డబ్బులు సర్దుబాటు కాక ఇబ్బందులు పడుతుండగా, విషయం తెలుసుకున్న ఇజ్రాయిల్ దేశంలో ఉంటున్న ఖానాపూర్ కు చెందిన గొల్లవత్తుల రాజేశ్వర్ అక్కడే ఉంటున్నా తెలంగాణ మిత్రుల సహాయంతో రూ. 50 వేలు పోగుచేసి, లక్ష్మీ కుటుంబానికి అందజేశారు. దీంతో సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్థిక సహాయం అందించిన రాజేశ్వర్, అతని మిత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. ఎన్ఆర్ఐ రాజేశ్వర్ ఔదార్యాన్ని పలువురు గ్రామస్తులు అభినందించారు. కాగా రాజేశ్వర్ స్థానిక మిత్రులు చిప్ప దేవన్న, గడుదాసు రవి చరణ్, మహేష్, నర్సయ్య, నాగరాజు, సునిల్, చంద్రగిరి శేఖర్, శ్రీనివాస్, నరేష్, వేముల నాగరాజు తదితరులు నగదును లక్ష్మీ సభ్యులకు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *