పొగాకు ఉత్పత్తులపై సుంకం పెంపు పట్ల హర్షం

హైదరాబాద్,(సిరా న్యూస్);
సిగరెట్లు, బీడీ ఇంకా పొగాకు ఉత్పత్తులపై సుంకం పెంపు, హెల్త్ టాక్స్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించటం ముదావహమని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు. సిగరెట్లతో పాటు బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై హెల్త్ ట్యాక్స్ పెంచాలని, ఈ రకమైన పన్ను విధించాలని కేంద్ర ఆర్థికశాఖ కసరత్తు చేస్తున్న దరిమిలా.. సోమవారంనాడు మాచన రఘునందన్ మాట్లాడుతూ..హెల్త్ టాక్స్ విధింపు, పెంపు అనే నిర్ణయాలతో పాటుగా పొగాకు, పొగాకు ఉత్పత్తులను పాఠశాలలు, కళాశాలలున్న ప్రాతంలో అర కిలోమీటరు వరకు విక్రయించకూడదన్న ఆంక్షల్ని విధించి అవి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధిoచారు. ప్రధాని నరేంద్రమోడీ బాలలతో, విద్యార్థులతో కలివిడిగా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు ఆన్న విషయం దృష్టిలో పెట్టుకుని పాఠశాలలు, కళాశాలలున్న చోట అర కిలోమీటర్ దూరం వరకు పొగాకు, పొగాకు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధిస్తే భవిష్యత్ భారతం ఎంతో వికసిస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయమౌవుతుందని అన్నారు. హెల్త్ టాక్స్ పెంపు ఆహ్వానించదగ్గ పరిణామమే, హర్షణీయమే, సిగరేట్ పాకెట్లను కాకుండా.. విడిగా విక్రయిస్తే, టాక్స్ మరింత పెంచితే.. యువత ధూమపానానికిదూరంగా ఉండే అవకాశం ఉందని రఘునందన్ చెప్పారు. యువత భవితను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సూచన చేశారు. ఇరవై ఏళ్లుగా పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నందుకు, పొగాకు ఉత్పత్తులపై కేంద్రం తీసుకునే నిర్ణయం ఆరోగ్య భారతానికి దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *