పోరంకి,(సిరా న్యూస్);
పోరంకిలో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికులను బెంబెలెత్తిస్తున్నాయి. మూడు రోజుల క్రితం బైక్ ను దుండగులు అపహరించారు. ఆదివారం రాత్రి స్థానిక మేరీ మాత చర్చ్ లోని హుండీ డబ్బులు చోరీ చేసారు. ఉదయం 5 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో కూడా ఇదే చర్చ్ లో రెండు సార్లు హుండీలోని సొమ్మును కాజేసార. ఆ విషయం ఇప్పటి వరకు తేలలేదు. పోలీసుల తీరు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.