సిరా న్యూస్;
జిల్లా వ్యాప్తంగా 317 పొలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఫ్రీ, ఫేర్, ట్రాన్స్పరెంట్ పోలింగ్ లక్ష్యం.ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించు కోవాలి
భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా కోరారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 30వ తేదీన జరగబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల కోసం భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 8మండలాల లో 317 పొలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు..
అందులో 93 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను,17 మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించమన్నారు.
మొత్తం భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 273633 ఓటర్లు ఉండగా
అందులో మహిళా ఓటర్లు 137743మంది
పురుష ఓటర్లు135884మంది
తర్డ్ జెండర్ ఓటర్లు6గురు
సర్వీస్ ఓటర్లు 170మంది
ఎన్.ఆర్.ఐ ఓటర్ల 8 మంది ఉన్నారని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామమన్నారు.
205 పొలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందని105 పొలింగ్ కేంద్రాలలో సీ.సీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.
వృద్ధులు ,వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్ ను, ఆటోను ఏర్పాటు చేశామన్నారు.ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు అన్నింటినీ కల్పించామని తెలిపారు.
ఇప్పటికే ఓటు ఫర్ హోమ్ ద్వారా ఫాం 12 డి అప్లై చేసుకొని 137 మంది నడవలేని వారు ఇంటి వద్ద నుండి ఓటు వేయడానికి దరఖాస్తు చేసుకోగా అందులో125 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఒక్కొక్క పొలింగ్ కేంద్రాలలో 200 నుండి 14వందల మంది వరకు ఓటర్లు ఉన్నారన్నారనీ 30వ తేదీ న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలలోపల ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేసి వారి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 25 తేదీ వరకు 97.64శాతం ఓటరు స్లిప్ లను పంపిణి చేయడం జరిగిందని..
భూపాలపల్లి నియోజకవర్గంలో ఇంకా ఎవరైనా ఓటర్లకు సమస్యలు ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమ సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు.