భువనగిరి ,(సిరా న్యూస్);
ప్రజాభిమానంతో పైన శేఖర్ రెడ్డి తిరిగి హ్యాట్రిక్ విజయం సాధించాడం ఖాయమని వడాయి గూడెం సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ అన్నారు. గ్రామంలో బీ ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బారి భారీ ర్యాలీతో ఊరేగింపు నిర్వహిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మనీష్ గౌడ్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజలతో సంబంధాలు కలిగిన వారిని ప్రజలు తిరిగి ఎన్నుకుంటారని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అద్భుతస్థాయిలో అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించిన పైల శేఖర్ రెడ్డి కి భారీ మెజార్టీతో ప్రజలు పట్టం కట్టబెడుతున్నారని ఆయన అన్నారు. సీనియర్ బీ ఆర్ఎస్ నాయకులు జర్నలిస్టుల సంఘం నేత గుండు ముత్తయ్య గౌడ్ మాట్లాడుతూ, ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని తమ గ్రామం పైల శేఖర్ రెడ్డి సహకారంతోనే గత నాలుగేళ్లలో విస్తృతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని ఆయనను తిరిగి గెలిపించుకోవడానికి తమ గ్రామం నుండి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు.