ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

– ఎస్వీఈఈపి నోడల్ ఆఫీసర్,జిల్లా సంక్షేమ అధికారిణి ఈపీ ప్రేమలత

ములుగు, (సిరా న్యూస్);
ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్వీఈఈపి నోడల్ అధికారి ఈపీ.ప్రేమలత అన్నారు.మంగళవారం జిల్లా ఎన్నికల అధికారిని,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ప్రేమలత

ఏటూరునాగారం మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు,ఎస్వీఈఈపి  ప్రత్యేక ఓటర్లతో చైతన్య ర్యాలీ నిర్వహించారు.ఈ అవగాహన ర్యాలీలో ఓటు అనేది ఓటర్ కి గుర్తింపు అని,దాన్ని నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు అంటూ నినాదాలు చేస్తూ వారంతా డిగ్రీ కళాశాల నుండి వై జంక్షన్ కూడలి వరకు కళాకారులతో ఓటు హక్కు వినియోగం పై చైతన్య గీతాలు ఆలపిస్తూ ర్యాలీతీసి, మానవ హారం నిర్వహించి అవగాహన కల్పించారు.అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జే. చిన్న అధ్యక్షతన డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో నూతనంగా ఓటరుగా నమోదు అయినటువంటిడిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ముందుగా నూతనంగా ఓటు హక్కు పొందిన విద్యార్థినీ విద్యార్థులు మాట్లాడుతూ తాము ఎలాంటిప్రలోభాలకు లోనూ కాకుండా నిజాయితీగా, నైతిక విలువలు పాటిస్తూ తమ ఓటు హక్కును  వినియోగించుకుంటామని, తమ కుటుంబాలను తమ చుట్టుప్రక్కల సమాజాన్ని  అవగాహన కల్పించి వారుడబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసేలా జాగృతం చేస్తామని తెలపడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జే. చిన్నా మాట్లాడుతూ యువతఓటింగ్ సందర్భంగా నిష్పక్షపాతంగా  వ్యవహరించాలని కుల మత జాతి బంధుప్రీతి వంటి ఆపేక్ష లేకుండా నిజాయితీతో వ్యవహరించి ఓటు వేయాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఘన్ సింగ్మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న ఓటర్లంతా కూడా యువతరం కాబట్టి,వారంతా వారి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఓటును డబ్బుకు అమ్ముకోకుండా నిజాయితీగాఓటు వేసేలా అవగాహన కల్పించాలని కోరారు.అనంతరం జిల్లా ఎన్నికల ఐకాన్ గా నియమితుడైన జిల్లాకు చెందిన పర్వతారోహకుడు వివేక్ మాట్లాడుతూ యువత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఎట్టిపరిస్థితులలో వెనుకడుగు వేయరాదని ఎంత కష్టమైనా అనుకున్నది సాధించేవరకు పట్టుదలతో శ్రమించాలని యువతకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *