జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ, జాతీయ చట్ట దినోత్సవం
జయశంకర్ భూపాలపల్లి,(సిరా న్యూస్);
స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువల మీద భారత రాజ్యాంగం ఏర్పాటు జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. రామచంద్రా రావు అన్నారు. ఒక ఆత్మలాగా వుండి భారత ప్రభుత్వాన్నినడిపించేది రాజ్యాంగమే అని జడ్జి కొనియాడారు. భారత రాజ్యాంగ, జాతీయ చట్ట దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మంచిగా చదువుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జడ్జి గారు విద్యార్థులకు సూచించారు. మహనీయులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జడ్జి గారు అన్నారు. 18 సంవత్సరాలు నిండ కుండా పెళ్లీలు చేయడం చట్టరీత్య నేరం అని జడ్జి తెలిపారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు విధులను గురించి అందరూ అవగాహన పెంచుకొని వాటిని అనుసరిస్తూ జీవించాలని జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏదులాపురం శ్రీనివాస్ , పోక్సో కోర్ట్ పి. పి. శ్రీ విష్ణువర్ధన్ రావు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ రేగుల రాకేష్, న్యాయవాది ఆరెళ్లి వెంకట్ గౌడ్ , అధ్యాపకులు పాలకుర్తి రవీందర్ , విద్యార్థినులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు