ప్రజలు స్వేచ్చగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలో 144 సెక్షన్ అమలు
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
సిరా న్యూస్,జగిత్యాల;
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023 సందర్భంగా నవంబర్ 30 న ఎన్నికలు ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ నవంబర్ 28 వ తేదీ(మంగళవారం) సాయంత్రం 5 గంటల తరువాత నుంచి, డిసెంబర్ 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 7 గంటల వరకు జిల్లా లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
తెలిపారు…శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు,రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్
(క్యూఆర్టీ),స్ట్రయికింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ ఆన్నారు..