సిరా న్యూస్ చిగురుమామిడి:
బండి సంజయ్ కి కరీంనగర్ పార్లమెంటు టికెట్ ఖరారు..
సంబరాలు చేసుకున్న బిజెపి నాయకులు...
ప్రస్తుత కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా కేంద్ర బిజెపి నాయకత్వం ఖరారు చేయడం పట్ల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు.మండల కేంద్రంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమార్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పైడిపల్లి శ్రీనివాస్, కంది శంకర్, పొన్నం శ్రీనివాస్, పోలోజు సంతోష్ కుమార్, రమకాంత్ రెడ్డి, మామిడి రమేష్, బండి సందీప్, ఆరెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.