బద్వేల్ లో మహాత్మా జ్యతిరావ్ ఫూలే  వర్ధంతి

సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు పట్టణం లోని  సిద్దవటం రోడ్డు మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ఫూలే 133 వ వర్ధంతి  వేడుక కార్యక్రమం ఫూలే ఆశయ సాధన సమితి ఛైర్మెన్ గురుమూర్తి ఉత్సవకమిటి ఛేర్మెన్,మున్సిపల్ వైస్ ఛేర్మెన్ యర్రగొల్ల గోపాలస్వామి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అదిథులుగా హాజరైన బద్వేలు యం.యల్.ఎ  డా.సుధ గారు,ముఖ్య ఆహ్వానితులుగా వై.యస్.ఆర్ సి.పి గిద్దలూరు ఇన్ఛార్జి గానుగపెంట శ్రీనివాసులు,యోగివేమన యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు,వై.యస్.ఆర్ .సి.పి బద్వేలు మునిసిపల్ అధ్యక్షులు సుందరామిరెడ్డి,వై.యస్.ఆర్.సి.పి జిల్లా కార్యదర్శి యద్దారెడ్డి,జాతీయ బి.సి సంక్షేమ సంఘ బద్వేలు నియోజకవర్గ అధ్యక్షులు పి.అనిల్ కుమార్,బి.సి చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు బి.సి రమణ హాజరై ఫూలే విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా యం.యల్.ఎ  మాట్లాడుతూ 19 వ శతాబ్దంలో విద్యకు దూరంగా వున్న శూద్ర అతిశూద్ర కులాల వారు మరియు ముఖ్యంగా స్త్రీలు విద్యావంతులు అయితేనే కుటుంబము దేశము అభివృద్దిచెందుతుందని మహారాష్ట్ర లోని పూణేలో అతిశూద్ర బాలికల కోసం 1848 లో పాఠశాలను ఏర్పాటుచేసి బహుజనుల, స్త్రీల విద్యాభివృద్దికి కృషిచేసిన విద్యాదాత ఫూలే అన్నారు ఆయన ఆశయాల సాధన కొరకు అఅందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు ఫూలే ఆశయ సాధన సమితి మరియు జాతీయ బి.సి సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ ఫూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లా కాట్గూన్ అను గ్రామంలోని ఒక వెనుకబడిన కులంలో 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించి బహుజనుల విద్యాభివృద్దికే కాకుండా కర్షక కార్మికుల సమస్యల పైన మరియు  కుల నిర్మూలన కొరకు 1873 లో గులాంగిరి అనే పుస్తకాన్ని వ్రాశారు బహుజనుల విముక్తి కోసం పద్యాలు పాటలు నాటికలు వ్రాశారు.బ్రిటీషు వారితో మహాత్మా అను బిరుదు పొందారు ఆజీవితాంతం బహుజనుల స్త్రీల స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడి నవంబరు 28, 1890 లోచనిపోయారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *