మంథని,(సిరా న్యూస్);
మంథని నియోజకవర్గ బహుజనులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని, అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని ఎంపీపీ కొండ శంకర్, నాగారం సర్పంచ్ బూడిద మల్లేష్ లుపేర్కొన్నారు. శుక్రవారం మంథని పట్టణం ప్రెస్ క్లబ్ లో పార్టీ చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంథని నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో బహుజనులు ఏకమై వచ్చే అసెంబ్లీఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును ఆశీర్వదించి, అసెంబ్లీకి పంపాలని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని మంథని వాసులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని, వచ్చిఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు తెలపడం ఆనందంగా ఉందని వారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించినటువంటి రాజగృహాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతిని,ఆ రాజగృహం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. మంథనిలో ఉన్నటువంటి రాజ గృహం వారి సొంతానికే కాకుండా ప్రజలకు ఉపయోగపడడం లేదని వారు వాపోయారు.బహుజన వాదాన్ని ఎత్తుకున్న నాయకుడు బహుజనల ప్రయోజనాల కోసం పనిచేయకపోవడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనాబహుజనులు మేలుకొని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్అజీమ్ ఖాన్, నాయకులు మూల పురుషోత్త రెడ్డి, పర్శ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.