సిరా న్యూస్, ఖానాపూర్:
బాల్య వివాహాలను అరికట్టాలి..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అంగన్వాడి కేంద్రాల్లో బాల్య వివాహాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఎర్వచింతల్, చామన్పల్లి అంగన్వాడి టీచర్లు నర్సమ్మ,కవిత బాల్య వివాహాలను అరికట్టాలని అవగాహన కల్పించి, అనంతరం వారు మాట్లాడుతూ…బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని,నిర్ణీత వయసు రాకుండా వివాహాలు చేయవద్దని అన్నారు.బాల్య వివాహాలు వలన బాలికల్లో ఆత్మస్థైర్యం కోల్పోయి మానసికంగా,శారీరకంగా ఆరోగ్యం దెబ్బతింటుందని. బాల్య వివాహాలను అరికట్టడం మనందరి బాధ్యతని. బాల్య వివాహాలు జరిపిస్తే చట్ట ప్రకారం నేరస్తులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఆయాలు కమల, కళ,తల్లిదండ్రులు,కిశోర బాలికలు, తదితరులు పాల్గొన్నారు.