హుజూరాబాద్ (సిరా న్యూస్)
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని సింగాపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల 2500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు, ఇంటర్నేషనల్ స్కూలు, వృద్ధులకు 4000 రూపాయల పింఛన్ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో జమ్మికుంట మండలం సైదాబాద్, అంకుషాపూర్ గ్రామాల చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 30 మంది పార్టీ లో చేరారు. అలాగే హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్యకర్తలు, 11వ వార్డు మాజీ వార్డ్ మెంబర్ సుశీల ఆధ్వర్యంలో 20 మంది, హుజురాబాద్ మండలంలోని కాట్రాపల్లి గ్రామం చెందిన దాసరి ఐలయ్య ఆధ్వర్యంలో వివిధ చర్చిల పాస్టర్లు, హుజురాబాద్ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామానికి చెందిన 30 మంది యువకులు, జమ్మికుంట మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని సైదాబాద్, అంకుశాపూర్, తనుగుల, మాచనపల్లి గ్రామాల చెందిన సుమారు వందమంది కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని రవి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట ఆరవ వార్డు నెంబరు మారేపల్లి ప్రశాంత్ తో పాటు సుమారు 30 మంది కార్యకర్తలు, వంతడుపుల ఉప సర్పంచ్ మొగిలి, పాక సుధాకర్ ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ ఆహ్వానించారు.