బియ్యంపై ఎగుమతిపై ఆంక్షలు

న్యూఢిల్లీ, నవంబర్ 20, (సిరా న్యూస్)
ప్రపంచంలోని అగ్రశ్రేణి బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం, వచ్చే ఏడాది కూడా విదేశీ అమ్మకాలపై తన నియంత్రణలను కొనసాగించగలదని భావిస్తోంది. 2008 ఆహార సంక్షోభం తర్వాత తక్కువ ధరలతో పాటూ పుష్కలమైన నిల్వలు గల దేశంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. తద్వారా గత దశాబ్ద కాలంగా భారతదేశాన్ని ధాన్యం ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఇటీవల వెల్లడైన లెక్కల్లో 40 శాతం వాటాను కలిగి.. ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్రికన్ దేశాలు మన నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో దేశీయ ధరలపెరుగుదలను అరికట్టడానికి, వినియోగదారులను అధిక ధరల నుంచి రక్షించేందుకు పదేపదే ఎగుమతులపై పరిమితులను విధిస్తున్నారు.దేశీయ బియ్యం ధరలు పెరిగినంత కాలం ఈ పరిమితులు కొనసాగే అవకాశం ఉంది” మాజీ-జపాన్ చీఫ్ ఎకనామిస్ట్ సోనాల్ వర్మ అన్నారు. “ఎన్నికల తర్వాత కూడా దేశీయ బియ్యం ధరలు స్థిరంగా ఉండకపోతే, ఈ చర్యలు పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. భారతదేశం విరిగిన బాస్మతీ రైస్, వైట్ రైస్ పై ఎగుమతి సుంకాలు విధించింది. అందుకే వాటిని ఆ దేశం నుంచి ఎగుమతి చేసుకోలేమని తెలిపారు. దీని ఫలితంగా ఆగస్టులో ధరలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగాయి. అందుకే కొందరు దిగుమతి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. యూనైటెడ్ నేషన్ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకారం, అక్టోబర్‌లో బియ్యం నిలువలు సంవత్సరం క్రితం ఉన్న దానికంటే 24 శాతం ఎక్కువ ఉన్నట్లు తెలిపింది.మోదీ ప్రభుత్వం ఇంటింటికీ సరిపడా బియ్యం బియ్యాన్ని సరఫరా చేయడం ద్వారా ధరలను నియంత్రించాలని భావిస్తోందని బివి కృష్ణారావు తెలిపారు. ఈయన దేశంలోని రవాణాదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు పూర్తై ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ ప్రభుత్వం ఎగుమతి ఆంక్షలను కొనసాగించవచ్చని ఆయన అన్నారు. ఎల్ నినో కారణంగా ఆసియా అంతటా పంటలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. పొడి వాతావరణం కారణంగా 2023-24లో ఎగుమతిదారులో రెండవ స్థానంలో ఉన్న వరి ఉత్పత్తి 6 శాతం పడిపోయే అవకాశం ఉందని థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *