సిరా న్యూస్, జైనథ్:
ఈ ఎన్నికల్లో ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, ఆదిలాబాద్ బిజెపి అభ్యర్థి పాయల్ శంకర్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ లో బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు. బిజెపితోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదిలాబాద్ అభివృద్ధి చెందాలంటే పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలవాలని, ప్రతి ఒక్కరు కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామ రాకేష్ రెడ్డి, లింగారెడ్డి, రమేష్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, బండి రవి యాదవ్, సందీప్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.