సిరా న్యూస్, తలమడుగు:
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. ఈమేరకు తలమడుగు మండలంలోని బరంపూర్ , చర్లపల్లి , తొక్కి గూడా, రత్నాపూర్, తదితర గ్రామాలలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజా రెడ్డితో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో రైతాంగానికి రైతుబంధు రూపంలో వేల కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గతంలో 70 ఏండ్లు పరిపాలించిన పార్టీలు ఎన్నడూ రైతులను పట్టించుకోలేదని అన్నారు. ప్రజలంతా తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, నాయకులు కిరణ్, పిడుగు సంజీవరెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి , చర్లపల్లి గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, వసంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవికాంత్ యాదవ్, సునీత రెడ్డి, పల్లవి తదితరులు పాల్గొన్నారు.