పెద్దపల్లి, (సిరా న్యూస్) ;
బీఆర్ ఎస్ పార్టీతోనే యాదవుల సంక్షేమం జరిగిందని ఓదెల దేవస్థానం చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాంసం ఉత్పత్తులను పెంచాలని యాదవులకు గొఱ్ఱెల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని గుర్తు చేశారు. యాదవులకు 75 శాతం మందికి గొఱ్ఱెలు పంపిణీ చేశారని, ఎన్నికల అనంతరం మిగిలిన 25శాతం మందికి గొఱ్ఱెలు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. రాజకీయంగా రాష్ట్రంలో 5గురికి బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి సామాజిక న్యాయం చేసిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా యాదవులకు మేలు జరిగిందని అన్నారు. జిల్లా కేంద్రంలో యాదవ ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన బీ ఆర్ ఎస్ పార్టీకి అండగా ఉండాలని యాదవులకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో యాదవ నాయకులు ఆవుల కిషన్ యాదవ్, అర్కటీ రామస్వామి యాదవ్, పాలేటి కొమురయ్య యాదవ్, సలేంద్ర రాములు యాదవ్, నర్ల అంజయ్య యాదవ్, పెగడ శ్రీనివాస్ యాదవ్, బత్తుల లింగయ్య యాదవ్, పోలు రాజయ్య యాదవ్, సలేంద్ర కొమురయ్య యాదవ్, అట్ల సాగర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.